Anbanavan Asaradhavan Adangadhavan
-
ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది
ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుందంటున్నారు నటుడు శింబు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి వయసు మళ్లిన పాత్ర కాగా మరో రెండు యువ పాత్రలని ప్రచారం జరుగుతోంది.ఆయనకు జంటగా నటి తమన్నా, శ్రియ నటిస్తున్నారు.వయసు మళ్లిన పాత్రకు జంటగా శ్రియ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్రతో నటి తమన్నా ఉన్న ఫొటోలే విడుదలవ్వడం గమనార్హం. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గ్లోబల్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మాత మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్న అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై విశేష ఆదరణను పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శింబు స్పందిస్తూ ఈ చిత్రంలో తాను మూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నానన్నారు.అందుకే అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావించి ఆ పేరును నిర్ణయించినట్లు తెలిపారు. టీజర్ చూసి ఈ చిత్రం ఇలా ఉంటుందని ఊహించరాదన్నారు. తాము ఒక వైవిధ్య కథతో చేస్తున్న చిత్రం ఇదని తెలిపారు.ఇంకా చెప్పాలంటే ఒక ప్రయోగం చేస్తున్నామని చెప్పవచ్చునన్నారు. అయితే ఇందులో తనవి మూడు పాత్రలు కాదని, నాలుగు పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయం గురించి తాను చెప్పినందుకు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కోపగించుకోవచ్చునని, ఇది సరైన సమయంగా భావించి నాలుగో పాత్ర గురించి వెల్ల డించానని అన్నారు. ఈ పాత్ర చిత్రంలో సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పారు. -
వయసుతో పనిలేదు
వృత్తి పరంగా చూస్తే ఇతర రంగాలకు సినిమా రంగం కాస్త భిన్నం అని చెప్పక తప్పదు. ఇక్కడ ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఇక కథానాయికల విషయానికి వస్తే అందం, అభియనం, అదృష్టం ఈ మూడు ప్రధాన అర్హతలుగా భావించాల్సి ఉంటుంది. అదే విధంగా కథానాయికలకు సినీరంగంలో రాణించేందుకు వయసు ప్రభావం కూడా పని చేస్తుంది. అందుకే సాధారణంగా హీరోయిన్లు తమ వయసు గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. పుట్టిన తేదీ, నెల చెబుతారు కానీ ఏ సంవత్సరం పుట్టారన్నది ఎక్కడా చెప్పుకోరు. చాలా మంది పది, పదిహేనేళ్లుగా హీరోయిన్లుగా రాణిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారు తమ వయసు గురించి చెబితే ప్రేక్షకుల్లో తమపై ఆసక్తి తగ్గుతుందేమోనన్న భయం ఇందుకు ఒక కారణం కావచ్చు. అంతే కాదు కొందరైతే సినిమాల్లో తల్లిగా, హీరోకి భార్యగా నటించడానికి సందేహిస్తుంటారు. అలా మంచి అవకాశాలను కోల్పోయిన నాయికలు లేకపోలేదు. అలాంటి వారే హీరోయిన్గా మార్కెట్ తగ్గిన తరువాత అక్కగానో, అమ్మగానో నటించడం చూస్తున్నాం. ఇదే విషయాన్ని నటి శ్రియ వద్ద ప్రస్థావించగా తను ఎలా స్పందించారో చూద్దాం. సినిమా రంగాన్ని వేరే వృత్తులతో పోల్చకూడదు. నా విషయమే తీసుకుంటే 17 ఏళ్ల వయసులో నటిగా పరిచయం అయ్యాను. ఇప్పుడు నా వయసు 34. ఈ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వయసెంతైతే ఏమిటీ? 65 ఏళ్ల వరకూ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు బిగ్‌బీ అమితాబ్‌నే తీసుకుంటే ఆయనకు ఇప్పటికీ అద్భుతమైన పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయి. నటినైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అని అంటున్న శ్రియ ఇటీవల తెలుగులో బాలకృష్ణకు భార్యగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో తన నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరో వైవిధ్య పాత్రలో కనిపించనున్నారు. -
శింబు సినిమాకి బ్రేక్
చెన్నై: సంచలన నటుడు శింబు చిత్రాలు ఈ మధ్య వివాదాలకు, సమస్యలకు కేరాఫ్‌గా మారాయని చెప్పవచ్చు. శింబు చిత్రాలకు ఆయన సమస్యగా మారడమో లేక ఆయన చిత్ర నిర్మాతలు సమస్యల వలయంలో చిక్కు కోవడమో జరుగుతోంది. శింబు నటించిన ఇటీవల విడుదలైన అచ్చంయన్బదు మడమైయడా నిర్మాణ దశలోనే పలు సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శింబు బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకోవడంతో విడుదల ఆలస్యమైంది. కాగా తాజాగా శింబు అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్నారు. మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ చిత్ర నిర్మాత మైఖెల్ రాయప్పన్ తనకు రూ. 25 లక్షలు రుణం చెల్సించాల్సి ఉందని, అది తనకు చెల్లించే వరకూ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని ఫైనాన్సియర్ రమేష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 23వ తేదీన బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు నోటీసులు జారి చేసింది. -
అవసరమే అన్నీ చేయిస్తుంది!
వివాదాలకు చిరునామా అనిపించుకున్న తమిళ హీరో శింబు ఈ మధ్య బాగా బరువు పెరగడంతో పాటు గడ్డం పెంచేశారు. దర్శకుడు-నటుడు ఎస్.జె. సూర్య అయితే జిమ్‌లో అదే పనిగా కసరత్తులు చేస్తున్నారు. హోమ్లీ హీరోయిన్ విద్యాబాలనేమో వాట్సాప్ ద్వారా మాతృభాష నేర్చుకుంటున్నారు. హాట్ గాళ్ కంగనా రనౌత్ అయితే ఏకంగా బట్టలు ఉతుకున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ అన్నట్లు.. ‘ఏమైంది వీళ్లకు’ అనుకుంటున్నారా? మరేం లేదు.. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ల్లోని పాత్రల కోసమే కసరత్తులు చేస్తున్నారు. అశ్విన్ తాతగారు...వెరీ పవర్ఫుల్ సారూ... ‘అన్బానవన్.. అసరాదవన్.. అడంగాదవన్’.. శింబు హీరోగా నటిస్తున్న తమిళ చిత్రమిది. ఇందులో శింబు యువకుడిగా, మధ్యవయస్కుడిగా, వృద్ధుడిగా మూడు పాత్రల్లో కనిపించనున్నారు. మధ్యవయస్కుడి సరసన శ్రీయ, యువకుడి సరసన తమన్నా నాయికలుగా నటిస్తున్నారు. మూడు పాత్రల్లోనూ వ్యత్యాసం చూపించడానికి శింబు కసరత్తులు చేశారు. ముఖ్యంగా వృద్ధ పాత్ర కోసం చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ పాత్ర పేరు అశ్విన్ తాత. ఈ తాతగారు చాలా దృఢంగా ఉంటారట. అందుకని శింబు బరువు పెంచారు. ఈ పాత్రలో 95 కిలోల బరువుతో కనిపిస్తారు. గడ్డం, మీసాలు పెంచారు. మొహం మీద ముడతలు కనిపించాలి కాబట్టి, ప్రోస్థెటిక్ మేకప్ వేయించుకుంటున్నారు. ఇటీవల మేకప్ టెస్ట్ కూడా చేశారు. త్వరలో తాత పాత్రకు సంబంధించిన సీన్స్ తీస్తారు. సిక్స్ ప్యాక్ సూర్య మామూలుగా హీరోలు పాత్ర డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్ చేస్తారు. విలన్లకు ఆ పట్టింపు ఉండదు. ఎలాగైనా ఉండొచ్చు. నిన్న మొన్నటివరకూ పరిస్థితి ఇదే. ఇప్పుడు సీన్ మారింది. విలన్లు కూడా మేకోవర్ అవుతున్నారు. ప్రస్తుతం ఎస్.జె.సూర్య ఆ పని మీదే ఉన్నారని సమాచారం. ‘నాని’, ‘ఖుషి’, ‘పులి’ వంటి తెలుగు చిత్రాలతో పాటు పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్.జె. సూర్య హీరోగా కూడా నటిస్తుంటారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఎస్.జె.సూర్య సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారట. వాట్సప్ విద్యా! ‘డర్టీ పిక్చర్’లో గ్లామరస్‌గా విజృంభించినా ‘హోమ్లీ హీరోయిన్’ అనే ట్యాగ్ మాత్రం విద్యాబాలన్‌కి దూరం కాలేదు. నటిగా ఈవిడగారు సంపాదించుకున్న మార్కులు అలాంటివి. పాపం.. ఇటీవల డెంగ్యూ బారిన పడ్డారామె. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యాబాలన్ సెల్ఫోన్లో వాట్సాప్ ద్వారా తన మాతృభాష మలయాళం నేర్చుకుంటున్నారట. మలయాళ కవయిత్రి కమలా దాస్ జీవిత చరిత్రతో రూపొందనున్న మలయాళ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేయనున్నారు. విద్యాబాలన్ పుట్టింది కేరళలో అయినా పెరిగింది, చదువుకున్నది ముంబైలో. అందుకని మాతృభాష తెలియదు. ఇప్పుడు మలయాళ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి, భాష మీద పట్టు సాధించాలనుకుంటున్నారట. 30 రోజుల్లో మలయాళం నేర్పే పుస్తకం కొనుక్కున్నా జ్వరంతో కాగితాల మీద దృష్టి పెట్టలేకపోయారట. అందుకే వాట్సాప్‌ని ఆశ్రయించారట. మలయాళంలో ఫ్రెండ్స్ మెసేజులు పంపిస్తుంటే.. వాటి ద్వారా భాష నేర్చుకుంటున్నారట. గులాబీ బాల.. కష్టాలేల! సుకుమారి కంగనా రనౌత్ నేల తుడిస్తే, బట్టలు ఉతికితే చూడ్డానికి అభిమానులకు బాధగానే ఉంటుంది. అయినా, కోట్లు సంపాదిస్తున్న ఈ మేడమ్ ఎందుకీ పనులు చేస్తారనే సందేహం కలగొచ్చు. సినిమా కోసం చేయాల్సి వచ్చింది. కంగనా కథానాయికగా రూపొందనున్న చిత్రం ‘సిమ్రన్’. హన్సల్ మెహతా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలోని పాత్రకు సంబంధించిన వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి కంగనా యూఎస్ వెళ్లారు. అక్కడి అట్లాంటా హోటల్లోని హౌస్‌కీపింగ్ టీమ్‌తో మాట్లాడారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో? అడిగి తెలుసుకున్నారు. తన రూమ్‌కి వచ్చాక శుభ్రంగా ఊడ్చారట. బట్టలు ఉతుక్కున్నారట. పాత్రలో జీవించడానికే ఇదంతా చేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
త్రిపాత్రాభినయంలో శింబు
కథానాయకుల త్రిపాత్రాభినయం అన్నది ఇటీవల కోలీవుడ్‌లో చాలా అరుదైన విషయంగా మారింది. అప్పట్లో దివంగత మహానటుడు శివాజీగణేశన్ పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తరువాత కమలహసన్, రజనీకాంత్ బహుపాత్రల్లో మెరిశారు. ఆపై ఇదుగో ఇటీవల త్రిపాత్రాభియాల సందడి మొదలైందని చెప్పవచ్చు. నటుడు సూర్య 24 చిత్రంలో మూడు పాత్రలు పోషించి దుమ్మురేపారు. అదే విధంగా ఆయన సోదరుడు కార్తీ కూడా కాష్మోరా చిత్రంలో త్రిపాత్రాభినయంతో రానున్నారు. తాజాగా సంచలన నటుడు శింబు మూడు పాత్రలు ధరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఆధిక్ రవిచంద్రన్ చిత్రంలో అన్భానవన్ అదంగాదవన్ అసరాదవన్ అనే చిత్రంలో ట్రిపుల్ రోల్ చేయనున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అని సమాచారం. దీనికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.చాలా కాలం తరువాత శింబు, యువన్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ఇదే అవుతుంది. యువన్ ఇప్పటికే దీని పాటలకు రాగాలు కట్టడం ప్రారంభించారట. త్వరలోనే ఆ అన్భానవన్ అదంగాదవన్ అసరాదవన్ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం.