గోవా: తనపై జోక్ వేసిన నటుడికి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖల మంత్రి స్మృతీ ఇరానీ తగిన రీతిలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. గోవాలో సోమవారం 48వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. స్మృతీ ఇరానీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. డైరెక్టర్ మజిద్ మజీది తీసిన ఓ సినిమాను ప్రదర్శించారు. ఆ మూవీ గురించి యాంకర్‌గా చేసిన రాజ్‌కుమార్ చెబుతూ అత్యుత్సాహానికి పోయి.. ‘ఈ డైరెక్టర్ మజిద్ మజీది కూడా మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయనా ఇరానీనే’ అంటూ జోక్ చేశాడు.
ఆపై కేంద్ర మంత్రి ఆ నటుడికి ఊహించని షాకిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎంత సంయమనంతో, సహనంతో పాలిస్తుందనడానికి ఓ నటుడు కేంద్ర మంత్రిపై జోక్ చేయడమే నిదర్శనమని స్మృతీ ఇరానీ బదులిచ్చారు. రాజ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలపాలి. నువ్వు చేసిన వ్యాఖ్యలతోనైనా కేంద్ర ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని అందరికీ తెలిసింది. ’నాపై జోక్‌తో నైనా నీకాలు విరగొట్టింది మా బీజేపీ కార్యకర్తలు, మద్ధతుదారులంటూ ఏ ఒక్కరూ నిందలు వేసే అవకాశమే లేదంటూ’నటుడు రాజ్‌కుమార్‌తో మంత్రి స్మృతీ ఇరానీ కౌంటర్ ఇవ్వడంతో అక్కడున్న వారు షాకయ్యారు. ఇటీవల ఓ మూవీ షూటింగ్‌లో రాజ్‌కుమార్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈవెంట్ కు వ్యాఖ్యాతలుగా వ్యహరించిన రాజ్‌కుమార్ రావ్, నటి రాధికా ఆప్తేలను ప్రశంసిస్తూ ఆమె ట్వీట్ చేయడం గమనార్హం.
Compliments to @RajkummarRao & @radhika_apte for being such wonderful hosts at #IFFI2017 Opening Ceremony. pic.twitter.com/4bbO8mh2pG
— Smriti Z Irani (@smritiirani) 20 November 2017
Comments
Please login to add a commentAdd a comment