అలాంటివాడే కావాలి!
పెళ్లి కాని అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలాంటివాడైతే బాగుంటుందో ఊహించుకుంటుంటారు. బాలీవుడ్ కథానాయిక సోనమ్‌కపూర్ అప్పుడప్పుడూ ఆ ఊహల్లోనే మునిగి తేలుతున్నారు. కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ లిస్ట్ కూడా రాసుకున్నారు. ఇలాంటివాడైతేనే బాగుంటుందనే క్లారిటీ తనకు పుస్తకాలు చదవడం వల్లే వచ్చిందంటున్నారు. ఇక, తను పెళ్లాడాలనుకునే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో సోనమ్ చెబుతూ - ‘‘ప్రేమకు స్థాయి ముఖ్యం కాదని చాలామంది అంటుంటారు.
నా దృష్టిలో స్థాయి ముఖ్యమే. అందుకే నా స్టేటస్‌కి తగ్గవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మాకన్నా తక్కువ స్థాయి వ్యక్తిని చేసుకుంటే అడ్జస్ట్ కావడం కష్టం. నా స్టేటస్‌కి మించినవాడైనా కష్టమే. ప్రాక్టికల్‌గా ఆలోచించి చెబుతున్న మాట ఇది. ఒకే స్థాయికి చెందిన అమ్మాయీ, అబ్బాయీ పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఏ సమస్యలూ రావని నా ఫీలింగ్. సోనమ్ డబ్బుకి విలువ ఇస్తుందని ఎవరైనా అనుకుంటే నో ప్రాబ్లమ్. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయితే డబ్బుతో పాటు మంచి మనసున్న వ్యక్తిని పెళ్లాడాలనుకుంటున్నా. బంధాల మీద కూడా అతనికి నమ్మకం ఉండాలి’’ అన్నారు.