బాలీవుడ్, టాలీవుడ్ నటుల పోలికలతో ఉన్న చాలామంది టిక్‌టాక్ వీడియోలు గతంలో అభిమానులను విపరీతంగా ఆకర్షించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ లోకాన్ని వీడి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను శోకసంద్రంలోముంచిన అలనాటి అందాలతార శ్రీదేవి ఇపుడు టిక్‌టాక్ ద్వారా అభిమానుల జ్ఞాపకాల్లో విహరిస్తున్నారు. మరణించి సుమారు రెండేళ్లు కావస్తున్నా ఫ్యాన్స్ అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ ఆర్టిస్ట్ రాఖీ వీడియోలతో సంచలనం రేపుతోంది. బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి పోలికలతో ఉన్న క్వీన్ రాఖీ పేరుతో ఆమె టిక్ టాక్ వీడియోలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. శ్రీదేవి నటించిన పలు ప్రముఖ చిత్రాలతోపాటు చాల్‌బాజ్, నాగిని హిమ్మత్‌వాలా పాటలు, ఇతర సెన్సేషనల్ మూవీల డైలాగుల టిక్‌టాక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment