విజయవాడ: 'శ్రీమంతుడు' చిత్రం విజయోత్సవ వేడుకలను అక్టోబర్ 24న అమెరికాలోని న్యూజెర్సీలో జరుపనున్నట్లు ఆ చిత్ర నిర్మాత యలమంచిలి రవిశంకర్ తెలిపారు. ఈ వేడుకల్లో చిత్ర హీరోహీరోయిన్లతో పాటు నటీనటులంతా పాల్గొంటారని ఆయన తెలియజేశారు.
విజయవాడలోని తన స్నేహితుల ఇంటికి వచ్చిన సమయంలో రవిశంకర్ మీడియాతో ముచ్చటించారు. మహేశ్‌బాబు అభిమానులు న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నారని అందుకే ఈ వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సుమారు 3 వేల మంది తెలుగువారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
న్యూజెర్సీలో 'శ్రీమంతుడు' వేడుకలు
Published Sun, Sep 13 2015 6:28 PM | Last Updated on Thu, Jul 25 2019 5:39 PM
Advertisement
Advertisement