ముంబై : బాలీవుడ్ బాద్‌షా, సీనియర్ నటుడు షారుఖ్ ఖాన్ మరింత చిక్కుల్లో కూరుకుపోతున్నారు. కొన్నేళ్ల కిందట షారుఖ్ సొంతం చేసుకున్న 20,000 గజాల అలీబాగ్ ప్లాట్స్‌ను, నకిలీ పత్రాలతో కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని షారుఖ్ సన్నిహితుడు, ఆయనకి ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఉంటున్న మోరేశ్వర్ అజ్గాంకరే స్వయంగా తెలిపారు.
షారుఖ్ సూచనలతోనే అలీబాగ్ ప్లాట్స్‌ను నకిలీ పత్రాలతో కొనుగోలు చేసినట్టు మోరేశ్వర్ ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు ఒప్పుకున్నాడు. షారుఖ్ వ్యవసాయ కోసం ఈ ప్లాట్స్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే దీనిని అందుకోసం ఉపయోగించకుండా.. ఒక విలాసవంతమైన ఫామ్‌హౌస్ నిర్మించడంతోపాటు, దానికి బంధువుల్ని డైరెక్టర్లుగా నియమించి సర్వాధికారాల్ని తానే కలిగి ఉన్నాడు.
19,960 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి విలువ (సర్కిల్ రేటు) సుమారు. రూ. 146.7 మిలియన్లు(15 కోట్లు). అయితే మార్కెట్ ధర దీనికి ఐదు రెట్లు పెరగనుందని మరో ఐటి అధికారి చెప్పారు. ఇందులో బీచ్, స్విమ్మింగ్‌పూల్ తోపాటు, ప్రైవేట్ హెలిప్యాడ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. షారుఖ్ సూచనల కింద మోరేశ్వర్ పనిచేస్తున్నాడని ఆదాయపు పన్ను శాఖ కూడా తెలిపింది. ఈ విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌ను ప్రస్తుతం ఐటీ శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసింది. కింగ్ ఖాన్ నేరం రుజువైతే ఆరు నెలలనుంచి ఏడేళ్ల దాకా శిక్ష, ఆస్తిలో 10 శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment