
ఇంటివాడైన యువహీరో
యువహీరో సందీప్ కిషన్ తన జీవిత లక్ష్యాల్లో ఒకటి సాధించాడు. 28 ఏళ్ల ఈ కథానాయకుడు తాను పెట్టుకున్న మూడు గోల్స్ లో ఒకటి సాకారం చేసుకున్నాడు. హైదరాబాద్ ఇల్లు, స్పోర్ట్స్ కారు, సొంత హోమ్ ధియేటర్ ఉండాలన్నది అతడి కల. ఇందులో మొదటి లక్ష్యాన్ని సాధించాడు. సొంత ఇల్లు కొనుక్కుని ఓ ఇంటివాడయ్యాడు. మాదాపూర్ లో నాలుగు బెడ్ రూముల ఫ్లాట్ కొనుక్కున్నాడు. తన మామయ్య ఇంటిని తిరిగి కొన్నాడు.
'ఏదోక రోజు నీ అపార్ట్ మెంట్ కొంటా'నని చిన్నప్పుడు మామయ్యతో చెప్పానని సందీప్ కిషన్ గుర్తు చేసుకున్నాడు. అతడి మావయ్య తన ఇంటికి దర్శకుడు వివి వినాయక్ కు అమ్మేశాడు. ఈ ఇంటిని మూడు నెలల క్రితం వినాయక్ నుంచి సందీప్ కిషన్ కొన్నాడు. తన ఫ్లాట్ చాలా బాగుందని, ఇక్కడ నుంచి చూస్తే దుర్గంచెరువు కన్పిస్తుందని చెప్పాడు. ఏడు ఏళ్లుగా తాను దాచుకున్న డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నానని వెల్లడించాడు.