4 భాషలు... 5 కోట్లు | Sunny Leone's startling salary demand for her first Tamil film | Sakshi
Sakshi News home page

4 భాషలు... 5 కోట్లు

Published Tue, Dec 19 2017 12:15 AM | Last Updated on Tue, Dec 19 2017 4:31 AM

Sunny Leone's startling salary demand for her first Tamil film - Sakshi

హాట్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ పారితోషికం ఎంత? అంటే.. ఐటమ్‌ సాంగ్‌కి అయితే అరకోటి. కథానాయికగా నటిస్తే ఫుల్‌ కోటి. స్టోరీ, సీన్స్‌ డిమాండ్‌ని బట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అయితే ఇప్పుడో సినిమాకి ఏకంగా 5 కోట్లు అడిగారట సన్నీ. అంత అడిగారంటే బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఈ చిత్రాన్ని మొత్తం 4 భాషల్లో విడుదల చేయాలన్నది దర్శక–నిర్మాతల ప్లాన్‌. ఇది సాదా సీదా సినిమా కాదు. హాట్‌ హాట్‌గా కనిపించడం సన్నీకి హల్వా తిన్నంత ఈజీ. కానీ, ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ చేయాలి. కత్తి యుద్ధాలూ చేయాలి. ఎందుకంటే ఇది పీరియాడికల్‌ మూవీ. తమిళ దర్శకుడు వడివుడయాన్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాకి 100 రోజులు డేట్స్‌ ఇచ్చారట సన్నీ. అందుకే మొహమాటపడకుండా 5 కోట్లు అడిగి ఉంటారు.

 ఈ సంగతలా ఉంచితే.. బెంగళూరులోని ఓ సంస్థ న్యూ ఇయర్‌ వెల్‌కమ్‌ షోకి సన్నీ లియోన్‌తో ఓ డ్యాన్స్‌ షోను ప్లాన్‌ చేసింది. అయితే కర్ణాటక రక్షణ వేదిక ఈ షో గురించి అభ్యతరం తెలిపింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ షోను నిలిపివేయాల్సిందిగా ఆదేశం జారీ చేసింది. ఈ షో నిర్వాహకులు మాత్రం ఆల్రెడీ కొన్ని టిక్కెట్స్‌ను అమ్మేశారట. మరి కొనుక్కున్నవాళ్లు ఊరుకుంటారా? వాళ్ల కోసమైతే గవర్నమెంట్‌తో మాట్లాడి.. సన్నీని షో నిర్వాహకులు కర్ణాటకకు రప్పించుకుంటారో? లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement