High Remuneration
-
ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్!
Urvashi Rautela Charged Rs 20 Crores For The Legend Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకంటే హీరోలు అధిక పారితోషికం తీసుకోవడం సాధారణమే. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకునే ముద్దుగుమ్మలు మాత్రం చాలా అరుదు. అయితే స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్‌ను ఓ హీరోయిన్ తీసుకుందన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఊర్వశీ రౌటేలా తాజాగా 'ది లెజెండ్' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్ 51 ఏళ్ల వయసులో హీరోగా నటించాడు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జేడి-జెయర్ ద్వయం దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హరీశ్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా జులై 28న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు ఊర్వశీ రౌటేలా రూ. 20 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుందని ఇటు కోలీవుడ్‌లో, అటు బాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు ఏ తమిళ హీరోయిన్‌కు అందని పారితోషికం ఊర్వశీకి తీసుకుందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ వార్తలను ఊర్వశీ రౌటేలా టీమ్ సన్నిహితం వర్గం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని, ఊర్వశీ రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే తమిళ ఇండస్ట్రీలో అత్యంత భారీ పారితోషికాన్ని అందుకున్న హీరోయిన్గా ఊర్వశీ రికార్డుకెక్కేది. కాగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార తన రాబోయే చిత్రాలకు రూ. 10 కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. -
దీపికా, కంగనాల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!
పారితోషికం అనాల్సింది.. భారితోషికం అన్నారేంటి అనుకుంటున్నారా? అయితే మ్యాటర్‌లోకి ఎంటర్ అవ్వండి. మనలో మన మాట. హీరోలకు పారితోషికం ఎక్కువా? హీరోయిన్లకా? అంటే.. ఎవరైనా ‘హీరో’లకే అంటారు కదా. ఇద్దరు నాయికల విషయంలో ఈ సీన్ రివర్స్ అయింది. ఆ విషయంలోకి వస్తే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎక్కువగా హీరో ఇమేజ్ మీద నడుస్తున్నాయి. కథలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి కూడా. అందుకే పారితోషికం విషయంలోనూ హీరోలదే పై చేయి. కానీ మెల్లిగా ఈ పద్ధతి మారుతున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ల మార్కెట్‌ని బట్టి మాకింత కావాలని నాయికలు నిక్కచ్చిగా తమ పారితోషికాన్ని డిమాండ్ చేసి, పుచ్చుకుంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘పద్మావత్’ సినిమాలో హీరోలు షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌ల కంటే కూడా దీపికా పదుకోన్‌నే ఎక్కువ పారితోషికం (దాదాపు 13 కోట్లు) పుచ్చుకున్నారు. షాహిద్, రణ్‌వీర్‌లు చెరో 10 కోట్లు తీసుకున్నారట. ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ – ‘‘నా మార్కెట్ గురించి నాకు తెలుసు. అందుకే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశాను’’ అన్నారు. తాజాగా ‘మణికర్ణిక’ సినిమా కోసం కంగనా రనౌత్ సుమారు 14కోట్లు దాకా తీసుకున్నారని టాక్. సాధార ణంగా కంగనా తీసుకునే పారితోషికం కంటే ఇది డబుల్ అట. స్క్రిప్ట్ బట్టి, అందులో పోషించాల్సిన పాత్ర బట్టి ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నారట కంగనా. పారితోషికం అనేది హీరో, హీరోయిన్ బట్టి కాకుండా మార్కెట్లో తమకున్న డిమాండ్‌ని, పాత్ర కోసం పడాల్సిన కష్టాన్ని బట్టి ‘భారితోషికం’ పుచ్చుకుంటున్నారు. పాత పద్ధతులకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది శుభ పరిణామమే అంటున్నారు సినీ విశ్లేషకులు. -
4 భాషలు... 5 కోట్లు
హాట్ స్టార్ సన్నీ లియోన్ పారితోషికం ఎంత? అంటే.. ఐటమ్ సాంగ్‌కి అయితే అరకోటి. కథానాయికగా నటిస్తే ఫుల్ కోటి. స్టోరీ, సీన్స్ డిమాండ్‌ని బట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అయితే ఇప్పుడో సినిమాకి ఏకంగా 5 కోట్లు అడిగారట సన్నీ. అంత అడిగారంటే బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఈ చిత్రాన్ని మొత్తం 4 భాషల్లో విడుదల చేయాలన్నది దర్శక–నిర్మాతల ప్లాన్. ఇది సాదా సీదా సినిమా కాదు. హాట్ హాట్‌గా కనిపించడం సన్నీకి హల్వా తిన్నంత ఈజీ. కానీ, ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ చేయాలి. కత్తి యుద్ధాలూ చేయాలి. ఎందుకంటే ఇది పీరియాడికల్ మూవీ. తమిళ దర్శకుడు వడివుడయాన్ తెరకెక్కించనున్న ఈ సినిమాకి 100 రోజులు డేట్స్ ఇచ్చారట సన్నీ. అందుకే మొహమాటపడకుండా 5 కోట్లు అడిగి ఉంటారు. ఈ సంగతలా ఉంచితే.. బెంగళూరులోని ఓ సంస్థ న్యూ ఇయర్ వెల్కమ్ షోకి సన్నీ లియోన్‌తో ఓ డ్యాన్స్ షోను ప్లాన్ చేసింది. అయితే కర్ణాటక రక్షణ వేదిక ఈ షో గురించి అభ్యతరం తెలిపింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ షోను నిలిపివేయాల్సిందిగా ఆదేశం జారీ చేసింది. ఈ షో నిర్వాహకులు మాత్రం ఆల్రెడీ కొన్ని టిక్కెట్స్‌ను అమ్మేశారట. మరి కొనుక్కున్నవాళ్లు ఊరుకుంటారా? వాళ్ల కోసమైతే గవర్నమెంట్‌తో మాట్లాడి.. సన్నీని షో నిర్వాహకులు కర్ణాటకకు రప్పించుకుంటారో? లేదో చూడాలి. -
ఇచ్చింది పుచ్చుకుని నటించా!
డబ్బు..డబ్బు..డబ్బు. ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఇందుకు అతీతులంటూ ఎవరూ ఉండరు. ఇక తారల విషయానికి వస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీను అనుసరిస్తుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్‌కు అధిక పారితోషికం చెల్లిస్తే తానూ ఆడటానికి రెడీ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తానేమీ తక్కువ కాదు అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు కూడా ఈ మధ్య తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌లో నేను పక్కా లోకల్ అంటూ సింగిల్ సాంగ్‌లో రెచ్చిపోయి స్టెప్పులేశారన్నది గమనార్హం. అందుకు తగిన పారితోషికాన్ని పుచ్చుకున్నారు. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తమిళంలో అజిత్ 57వ చిత్రంతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, నటుడు రానాతో మరో చిత్రంలో నటిస్తున్నారు. ధనుష్‌తో మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే జీవాకు జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి కాజల్ పేర్కొంటూ సాధారణంగా హీరోయిన్లు మంచి కథ, కథాపాత్ర ఉంటే చాలని అంటుంటారన్నారు. వాటితో పాటు మంచి పారితోషికం కూడా చాలా ముఖ్యమని తాను అంటానన్నారు. తాను 22 ఏళ్ల వయసులో చిత్రరంగ ప్రవేశం చేశానని, తనకు ఇక్కడ గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరని చెప్పారు. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. మొదట్లో ఇచ్చిన పారితోషికాన్ని కాదనకుండా పుచ్చుకుని నటించేదాన్నని, అదే విధంగా వచ్చామా.. నటించామా.. వెళ్లామా.. అన్నట్టుగా ఉండేదాన్నన్నారు. అలాగే కొన్ని చేయకూడని చిత్రాలు చేశానని, కొన్ని తప్పటడుగులు వేశానని చెప్పారు. ఆ తరువాత కాస్త తెలివిమీరానని , అయితే అతితెలివి కూడా ఇక్కడ పనికిరాదన్నారు. పారితోషికం చాలా ముఖ్యం అని గ్రహించానని చెప్పారు. ప్రతి ఏడాది చేసిన చిత్రాలు, పొందిన పారితోషికాన్ని క్యాలుక్యులేట్ చేసుకుని తరువాత ఏడాది నటించే చిత్రాలకు పారితోషికం గురించి నిర్ణయించుకుంటానని తెలిపారు. అదే విధంగా పాత్రల ఎంపిక విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటున్నాననీ, పాత్ర, పారితోషికం సంతృప్తిగా ఉంటేనే నటించడానికి అంగీకరిస్తున్నానని కాజల్‌అగర్వాల్ పేర్కొన్నారు. -
ఐటెం సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్...