
'ఖాకీ' కథపై మనసుపడ్డ చెర్రీ
టాలీవుడ్ మెగా వారసుడు, యంగ్ హీరో రామ్చరణ్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. తుఫాన్ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన
చెన్నై: టాలీవుడ్ మెగా వారసుడు, యంగ్ హీరో రామ్చరణ్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. తుఫాన్ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ యంగ్ హీరో మరోసారి 'ఖాకీ' కథపై మనసుపడ్డాడట. ఇంకా పేరు ఖరారు చేయని 'తాని ఒరువన్' రీమేక్ మూవీలో చెర్రీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ నటించనున్నాడట. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ' బ్రూస్ లీ' చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. నిర్మాత దానయ్య ఈ విషయాన్ని 'ఐఎఎన్ఎస్'కు వివరించారు. మిగతా నటీనటులను ఇంకా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
కాగ ఓ సిన్సియర్ పోలీసు అధికారి, అవినీతి, అక్రమాలకు పాల్పడే బడా పారిశ్రామికవేత్త మధ్య నడిచే కథాంశంతో తమిళంలో విడుదలైన మూవీ 'తాని ఒరువన్`. తమిళంలో జయం రవి పోలీసు అధికారిగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 70 కోట్ల బిజినెస్ ను సాధించింది. నయన తార హీరోయిన్ నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్గా నటించారు. తెలుగులో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం.