సాక్షి, సినిమా : కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఎన్‌జీకే అన్న టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సూర్యకు ఇది 36వ చిత్రం.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సూర్య చెగువేరా స్టైల్లో ఉన్న వేషాధారణ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో విప్లవ నేపథ్యం ఉన్న థీమ్ ఉండటం విశేషం. వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న సెల్వరాఘవన్.. సూర్యతో ప్రయోగం చేయబోతున్నాడని పోస్టర్‌తో అర్థమౌతోంది.
సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం.. పైగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఎన్‌జీకే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dear all! Need your love for #NGK
— Suriya Sivakumar (@Suriya_offl) 5 March 2018
Director @Selvaraghavan !! A very Happy birthday!!#NGKdiwali2018 #Suriya36@Sai_Pallavi92 @Rakulpreet @thisisysr @prabhu_sr @RelianceEnt @DreamWarriorPic pic.twitter.com/uVb42EJOgb
Comments
Please login to add a commentAdd a comment