జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక | Suriya Releases Jyothika Magalir Mattum First Look on dasara | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక

Published Wed, Oct 12 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక

జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక

లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక మరో విభిన్న పాత్రలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హీరో సూర్యతో వివాహం తరువాత నటనకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటి 2015లో రిలీజ్ అయిన 36 వయదినిలే సినిమాతో తిరిగి వెండితెర మీద సందడి చేసింది.

సూర్య నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా జ్యోతికకు మరోసారి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అదే జోరులో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది జ్యోతిక. మగలిర్ మట్టుమ్ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో జ్యోతిక జర్నలిస్ట్గా కనిపించనుంది.

మరోసారి సూర్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈసినిమాకు బ్రహ్మ దర్శకుడు. దసరా సందర్భంగా సూర్య.., ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. జ్యోతికతో పాటు సీనియర్ నటీమణులు శరణ్య, భానుప్రియ, ఊర్వశిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement