![Suriyas GANG To Clash With Pawan Kalyan new film - Sakshi - Sakshi - Sakshi - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/25/Pawan%20Kalyan%20Suriya.jpg.webp?itok=R4tjwksO)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పవన్ సినిమాకు తొలిసారిగా తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే టాలీవుడ్ సినిమాలేవి ఆ సమయంలో రిలీజ్ చేసేందుకు సాహసించటం లేదు. అయితే ఓ తమిళ డబ్బింగ్ సినిమా మాత్రం పవన్ కు పోటి వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో సూర్య బాలీవుడ్ సూపర్ హిట్ స్పెషల్ 26ను సౌత్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ ఒకేసారి రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమాకు తెలుగులో 'గ్యాంగ్' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. తెలుగు నాట యువి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాను పవన్ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తరువాత జనవరి 12న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment