మేకప్ లేకుండా నటిస్తోందట..! | Taapsee De glamourous Role in Ghaji | Sakshi
Sakshi News home page

మేకప్ లేకుండా నటిస్తోందట..!

Published Tue, Feb 2 2016 1:59 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

మేకప్ లేకుండా నటిస్తోందట..! - Sakshi

మేకప్ లేకుండా నటిస్తోందట..!

నటన పరంగా పెద్దగా మార్కులు సాధించకపోయినా తన గ్లామర్ షోతో బండి నెట్టుకొస్తున్న సౌత్ హీరోయిన్ తాప్సీ. తెలుగుతో పాటు తమిళ్లో స్టార్ ఇమేజ్ సాధించిన ఈ బ్యూటీ, బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇన్నాళ్లు ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన ఈ భామ త్వరలో ఓ ఛాలెజింగ్ పాత్రకు రెడీ అవుతోంది. తన ఇమేజ్ను పక్కన పెట్టి డీ గ్లామరస్ రోల్లో మేకప్ లేకుండా నటించడానికి రెడీ అవుతోంది.

రానా హీరోగా సంకల్పరెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న వార్ డ్రామా ఘాజీ. ఈ సినిమాలో పాకిస్థాన్ శరణార్థిగా నటిస్తోంది తాప్సీ. అంతేకాదు ఈ పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్న ఈ బ్యూటీ.. ఎలాంటి మేకప్ లేకుండా నటించాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లు తన టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం రాకపోవటంతో గ్లామర్ షోతో సరిపెట్టేసిన ఈ భామ, ఈసారి తన నటనతోనూ ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. మరి ఘాజీ మూవీతో అయినా టాలీవుడ్లో తాప్సీకి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement