
పెనాల్టీ కార్నర్, పెనాల్టీ షూటౌట్, డిఫెన్స్ గేమ్... హీరోయిన్ తాప్పీ ప్రజెంట్ ఎక్కడికి వెళ్లినా వీటి గురించే మాట్లాడుతున్నారట. కాస్త టైమ్ దొరికితే పాత హాకీ మ్యాచ్‌లను చూస్తున్నారట. వీలైతే హాకీ ప్లేయర్స్‌తో గేమ్ గురించి డిస్కస్ చేస్తున్నారట. ఎందుకంటే తాప్సీ తర్వలో హాకీ ప్లేయర్‌గా వెండితెరపై కనిపించబోతున్నారు. ఇండియన్ హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవితంలోని కొన్ని కీలక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. ఇందులో సందీప్ పాత్రలో దిల్జీత్ కనిపించనున్నారని హిందీ ఇండస్ట్రీ టాక్.
హీరోను ఇన్‌స్పైర్ చేసే హాకీ ప్లేయర్ రోల్‌లో తాప్సీ కనిపించబోతున్నారట. అందుకే ఆమె హాకీ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ‘‘20 ఏళ్ల క్రితం మా నాన్నగారు హాకీ ఆడుతున్నప్పుడు, ఆయన సాధించిన మెడల్స్ చూస్తూ పెరిగాను. హాకీ ఆడాలనే ఆకాంక్ష అప్పుడే నా మనసులో నాటుకుపోయింది. అది ఇప్పుడు నెరవేరుతోంది. నా హాకీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. ఆ సంగతలా ఉంచితే.. తాప్సీ చలాకీగా హాకీ ఆడుతుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని చూసినవాళ్లు అంటున్నారు.