బిగ్‌బాస్‌ షోలో మరో హీరోయిన్‌ ఎంట్రీ.. | taapsee pannu in big boss show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షోలో మరో హీరోయిన్‌ ఎంట్రీ..

Aug 17 2017 4:51 PM | Updated on Jul 18 2019 1:41 PM

బిగ్‌బాస్‌ షోలో మరో హీరోయిన్‌ ఎంట్రీ.. - Sakshi

బిగ్‌బాస్‌ షోలో మరో హీరోయిన్‌ ఎంట్రీ..

తెలుగు బిగ్‌బాస్‌షో కొత్త సినిమాలకు ప్రచార వేదిక అవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు బిగ్‌బాస్‌షో కొత్త సినిమాలకు ప్రచార వేదిక అవుతోంది. షోకు అత్యధిక టీఆర్పీ రేటింగులు ఉండటంతో నటీనటులు సైతం తమ సినిమా ప్రచారం కోసం బిగ్‌బాస్‌షోని ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం కొత్త కొత్త నటులు షోలోకి గెస్ట్‌ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రచారం కోసం దగ్గుపాటి రానా గత వారం బిగ్‌బాస్‌ షోలో సందడి చేశాడు. గత వారం దృవ ఫేం నవదీప్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా హీరోయిన్‌ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కి.. తొలి ట్రైలర్ నుంచి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కామెడీ హర్రర్ మూవీ ఆనందో బ్రహ్మా. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా సినిమా యూనిట్‌ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది.  ప్రచారంలో భాగంగా తాప్సీ బిగ్‌బాస్‌షోలో పాల్గొననుంది. షో కంటెస్టంట్లతో కలిసి ఈరోజు రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో ప్రేక్షకులను అలరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement