
సాక్షి, కాకినాడ : తెలుగు సినీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ప్రముఖ దర్శకుడు, బాహుబలి సృష్టికర్త ఎస్.ఎస్. రాజమౌళి ఈ నెల 23న గురువారం కాకినాడ రానున్నారు. రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, ఆయన భార్య శ్రీవల్లీ కూడా రానున్నారు. 23వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు భానుగుడి మహేంద్ర స్వీట్స్ వెనుక శ్రీకన్య ఇన్, శ్రీకన్య ఫంక్షన్ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.వీరితో పాటు మరికొంత మంది వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. బాహుబలి సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment