
మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చిరంజీవి ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తటంతో పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఆ సమయంలో విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు విమానంలో చిరు ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ వార్త వైరల్‌గా మారింది. చిరు హీరోగా తెరకెక్కిన భారీ హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.