సాక్షి, హైదరాబాద్: కరోనా మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు కొనసాగించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరి మిత సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని, వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహిం చుకోవచ్చన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో థియేటర్లను తిరిగి తెరిచేందుకు మాత్రం అనుమతి నిరాకరించారు.
పలువురు సినీ ప్రముఖులు ఇటీవల సీఎంను కలసి సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను తిరిగి నిర్వహించుకొనేందుకు, థియేటర్లను తెరిచేందుకు అనుమ తివ్వాలని కోరారు. సీఎం ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సినీ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందిం చారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిమిత సిబ్బందితో షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ ప్రముఖులు హామీ ఇవ్వడంతో ప్రభుత్వం ఈ మేరకు అనుమతిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment