మళ్లీ లగాన్ లాంటి సినిమా! | This made us cry: No Aamir Khan in Lagaan 2 | Sakshi
Sakshi News home page

మళ్లీ లగాన్ లాంటి సినిమా!

Published Sat, Oct 24 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

మళ్లీ లగాన్ లాంటి సినిమా!

మళ్లీ లగాన్ లాంటి సినిమా!

బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు.

బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. పధ్నాలుగేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం.
 
  ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్న ఘనత ఈ చిత్రానిది. ఇప్పుడు ఆమిర్‌ఖాన్ ఇదే తరహాలో ఓ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా భూమి పన్ను నేపథ్యంలోనే సాగుతుందని బోగట్టా. ప్రస్తుతం ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నటిస్తున్న ‘దంగల్’ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని ఆరంభించాలని ఆమిర్ అనుకుంటున్నారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement