
భాగీ2 చిత్రంలోని సన్నివేశం
బాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే ఫస్ట్‌డే కలెక్షన్స్. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ కలిసి నటించిన ‘భాగీ-2’ శుక్రవారం విడుదలై వసూళ్ల సునామీ సృష్టించింది. విడుదలైన ఒక్కరోజులోనే దాదాపు 25కోట్లు కొల్లగొట్టింది. ఇది సల్మాన్‌ఖాన్ ‘కిక్’ చిత్రం కంటే ఎక్కువ.
అడివి శేష్, ఆదాశర్మ కలిసి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క్షణం’ సినిమా రీమేక్‌గా భాగీ-2ను తెరకెక్కించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. విమర్శకులు సినిమాపై పెదవి విరిచినా... వసూళ్లు మాత్రం దుమ్ముదులిపాయి. యంగ్‌హీరోల్లో రణబీర్ కపూర్ బేషరమ్, యే జవానీ హై దివానీ సినిమాలతో మొదటిరోజే 25 కోట్ల వసూళ్లు రాబట్టాడు. తరువాత టైగర్ ష్రాఫ్ భాగీ-2 చిత్రంతో ఆ మార్క్ చేరుకున్నాడు.
సల్మాన్ నటించిన టైగర్ జిందా హై మొదటిరోజు దాదాపు 34 కోట్లు వసూళు చేసింది. అజయ్ దేవగన్ రెయిడ్, రాణీ ముఖర్జీ హిచ్‌కి లాంటి సినిమాలు ఉన్నా భాగీ-2 సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment