‘జనతా గ్యారేజ్’ అభిమానులకు పండగ
యంగ్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ’జనతా గ్యారేజ్’ ఈ రోజు విడుదలైంది. బెనిఫిట్ షో చూసినవారు సినిమా బాగుందని చెప్పడంతో అభిమానుల ఆనందం రెట్టిపయింది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులనే కాకుండా ప్రేక్షకులనూ ఆకట్టుకునే అలరిస్తుందని భావిస్తున్నారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుందని అంటున్నారు. సెకండాఫ్ ఫ్యాన్స్ కు పండగ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు.
‘జనతా గ్యారేజ్’ ధియేటర్ల దగ్గర తెల్లవారుజాము నుంచే సందడి నెలకొంది. బెనిఫిట్ షో కోసం అభిమానులు ధియేటర్ల ముందు బారులు తీరారు. జర్మనీలో ప్రివ్యూకు అద్భుత స్పందన వచ్చిందని ఓ అభిమాని ట్వీట్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, పలువురు సినీ నటులు.. హైదరాబాద్ లోని భ్రమరాంబ ధియేటర్ల ప్రివ్యూ వీక్షించారు. తమ సినిమాకు సానుకూల స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ సంతోషం వక్తం చేస్తోంది. దర్శకుడు కొరటాల శివ ’హ్యాట్రిక్ విజయం’ కొట్టాడన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.