
వజ్రాల కోసం....
ఒకేసారి వేల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది అడవిలో సాగించే అన్వేషణ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వజ్రాల వేట’. గిడ్డేష్, కిరణ్, సమీర ముఖ్యతారలుగా శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అచ్యుత్ బాలకృష్ణ, ఛాయాగ్రహణం: బీవీ రావు.