హీరో వరుణ్‌ తేజ్‌కు యాక్సిడెంట్‌ | Varun Tej Car Met With Accident | Sakshi
Sakshi News home page

హీరో వరుణ్‌ తేజ్‌ తృటిలో తప్పిన ప్రమాదం

Jun 12 2019 8:36 PM | Updated on Jun 12 2019 9:07 PM

Varun Tej Car Met With Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపెట్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్‌ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. వాల్మీకి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు వరుణ్ కారును ఢీకొట్టింది. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో వరుణ్‌కు ప్రమాదం తప్పింది. వరుణ్ కారును ఢీకొట్టిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా కారు ప్రమాదంతో వరుణ్‌ తేజ్‌ స్పందించారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ‘ నా కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాను. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. నాపై చూపించిన మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని వరణ్‌ ట్విట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement