పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వీణా మాలిక్! | Veena Malik becomes mother of boy | Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వీణా మాలిక్!

Sep 23 2014 4:39 PM | Updated on Sep 2 2017 1:51 PM

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వీణా మాలిక్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వీణా మాలిక్!

పాకిస్తానీ నటి, బాలీవుడ్ తార వీణా మాలిక్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

వాషింగ్టన్: పాకిస్తానీ నటి, బాలీవుడ్ తార వీణా మాలిక్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వాషింగ్టన్ లోని వర్జినీయా హస్పిటల్ సెంటర్ లో ప్రసవించినట్టు ఆమె భర్త అసద్ బాషిర్ ఖాన్ కఠాక్ తెలిపారు. భారతీయ రియాల్టీ షో 'బిగ్ బాస్'  ద్వారా పరిచయమై.. వీణామాలిక్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. 
 
తమ కుమారుడికి అబ్రాం ఖాన్ కఠాక్ అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ సందేశాన్ని అసద్ బాషిర్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా తన కుమారుడి పేరు మీద ట్విటర్ అకౌంట్ ను కూడా తెరిచారు. తన కుమారుడి పేరుతో తెరచిన ట్విటర్ అకౌంట్ లో 'ప్రపంచానికి స్వాగతం.. నేను వచ్చాను' అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement