పోలీసుల ప్రశ్నలు.. విజయ్‌ సమాధానాలు | Vijay Devarkonda Interacted With Field Level Hyderabad City Police Officers | Sakshi
Sakshi News home page

ఈ సమయం గడిచిపోతుంది: విజయ్‌ దేవరకొండ

Published Tue, Apr 14 2020 2:07 PM | Last Updated on Tue, Apr 14 2020 2:18 PM

Vijay Devarkonda Interacted With Field Level Hyderabad City Police Officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క‌రోనా సృష్టించిన విపత్తు లో ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యత‌లు నిర్వ‌ర్తిస్తున్న తెలంగాణ పోలీస్ అధికారుల‌తో టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సరదాగా ముచ్చ‌టించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలకరించారు. నిరంత‌రం ప‌నిచేస్తూ అల‌స‌ట పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజ‌య్ ప‌ల‌క‌రింపులు , మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయ‌ని అధికారులు పేర్కొన్నారు. 

ప్ర‌తి రోజూ  సాయంత్రం పోలీస్ క‌మీష‌న‌రేట్ లో జ‌రిగే వీడియో కాన్ఫ‌రెన్స్ లో విజ‌య్ పాల్గొన‌డం తో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇత‌ర సిబ్బందిలో కొత్త ఉత్సాహాం క‌న‌ప‌డింది. చాలా మంది పోలీస్ అధికారులు విజ‌య్ కి  థాంక్స్‌ చెబుతూ త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. పోలీసులలో ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ దేవరకొండ కు పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తో పాటు ఆయన సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ వారిని ఉత్సాహ ప‌రుస్తూ స‌మాధానాలు ఇచ్చారు. 

మీరు ఒక‌సారి పోలీస్ చెక్ పోస్ట్ ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను బ‌య‌టకు రావొద్ద‌ని కోరాలి 
త‌ప్ప‌కుండా వ‌స్తాను కానీ నేను వ‌చ్చిన‌ప్పుడు మీ లాఠీల‌కు ప‌నిచెప్ప‌కూడ‌దు అలాంటి ప‌ర్మీష‌న్ లెట‌ర్ నాకు ఇస్తే త‌ప్ప‌కుండా వ‌స్తాను. కానీ మ‌న సీఎం కేసీఆర్ సార్ చాలా క్లియ‌ర్ గా బ‌య‌ట‌కు రావొద్దు అని చెప్పారు. వాళ్లు చెప్పాక కూడా బ‌య‌ట తిరిగే వాళ్ళ‌కు మీ ప‌ద్ద‌తిలోనే స‌మాధానం చెప్పాలి. నేను వ‌చ్చి చెబితే మంచి జ‌రుగుతుంది అని మీరు న‌మ్మితే త‌ప్ప‌కుండా వ‌స్తాను.

లాక్ డౌన్ పీరియ‌డ్ లో మీరు మీ అమ్మ‌కు స‌హాయం చేస్తున్నారా?
నేను షూటింగ్‌లలో బిజీ ఉండేట‌ప్పుడు ఇంట్లో విష‌యాల్ని ప‌ట్టించుకునే వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ ప‌డుతున్న  క‌ష్టం చూస్తే మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను స‌హాయం చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు అమ్మ నీవ‌ల్ల మ‌రింత ప‌ని పెరుగుతుంద‌ని కోప్ప‌డుతుంది. కానీ ఇలాంటి స‌మ‌యంలో డ్యూటీలు చేస్తూ ఇంటి ప‌నిని చ‌క్క బెడుతున్న మ‌హిళా అధికారుల‌కు హ్యాట్సాఫ్‌.

పోలీస్ అధికారిగా మిమ్మ‌ల్ని చూడాల‌నుకుంటున్నాము
త‌ప్ప‌కుండా మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తాను. రెండు మూడేళ్లలో మంచి పోలీస్ పాత్ర‌తో మీ ముందుకు వ‌స్తా

మీరు పోలీస్ అయితే ఈ పరిస్థితిలో ఎలా ఫీల్ అయ్యే వారు? 
చాలా బాధ్య‌త‌గా ఫీల్ అయ్యే వాడిని. క‌మిష‌న‌ర్ గారి ఆదేశాల మేర‌కు ప‌నిచేసే వాడిని. మీరంద‌రూ మా కోసం ప‌నిచేస్తున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే మీరు ప‌నిగంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ అంద‌రికీ నా న‌మ‌స్కారాలు 

మీరు డిప్రెష‌న్ లో ఉంటే ఏం చేస్తారు? 
నా ప‌నే నాకు గుర్తింపు నిచ్చింది. మీ అంద‌రి ప్రేమ‌నిచ్చింది. నాకు ఫెయిల్యూర్స్ వ‌చ్చినా ఎప్పుడైనా లో ఫీల్ క‌లిగినా నా ప‌ని మీద మ‌రింత ఫోక‌స్ చేస్తాను. నేను చిన్న‌ప్పుడు మ‌హాభార‌తం ప్లే చేసాను స్కూల్లో. అప్పుడు  కృష్ణ భగవానుడు అన్న ఆ మాట నా మీద బాగా బ‌లంగా ప‌డింది.. ఈ స‌మ‌యం గ‌డిచిపోతుంది...నిజ‌మే ఏ స‌మ‌యం అయినా శాశ్వతం కాదు.. క‌రోనా కూడా అంతే  మ‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క‌రోనా కూడా మ‌న లైఫ్ లో ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది.

చదవండి:
కరోనా కట్టడికి 7 సూత్రాలు చెప్పిన మోదీ
పోలీసులతో జతకట్టిన అతిచిన్న మహిళ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement