ఈ తరం హీరోలు సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా చెన్నై సమీపంలోని వాండలూర్ జూలోని రెండు తెల్ల పులులను దత్తత తీసుకున్నారు. ఆరు నెలల పాటు ఈ పులుల పోషణకు కావాల్సిన పూర్తి ఖర్చును విజయ్ సేతుపతి భరించనున్నాడు.
ఈ మేరకు 5 లక్షల రూపాయల చెక్కును జూ నిర్వహకులకు అందజేశాడు విజయ్ సేతుపతి. గతంలో హీరోలు శివకార్తీకేయన్, కార్తీలు కూడా అదే జూలోని వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సూపర్ డీలక్స్ త్వరలో రిలీజ్ అవుతుండగా తమిళ్‌లో మా మనితన్ తెలుగులో సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment