విశాల్ డైరెక్షన్లో విజయ్ | vishal wants to direct vijay | Sakshi
Sakshi News home page

విశాల్ డైరెక్షన్లో విజయ్

Published Fri, May 13 2016 5:21 PM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

విశాల్ డైరెక్షన్లో విజయ్ - Sakshi

విశాల్ డైరెక్షన్లో విజయ్

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మాస్ హిట్స్తో సత్తా చాటుతున్న యంగ్ హీరో విశాల్. త్వరలో మరుదు సినిమాతో తమిళ, తెలుగు ఆడియన్స్ను అలరించడానికి రెడీ అవుతున్న విశాల్, ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం హీరోగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు మోస్తున్న యంగ్ హీరో తాను అనుకున్నది మాత్రం చేయలేకపోతున్నాడట.

విశాల్, డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడట, అయితే అనుకోకుండా వచ్చిన ప్రేమ చదరంగం అవకాశం ఈ నల్లనయ్యని హీరోగా నిలబెట్టింది. దీంతో డైరెక్షన్ ఆలోచనను పక్కనపెట్టి హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్, ఏదో ఒక రోజు తప్పకుండా డైరెక్షన్ చేస్తానంటున్నాడు.

'ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా, ఆడియో కంపెనీ అధినేతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే ఇవేవి నేను చేయాలనుకున్నవి కాదు. నేను దర్శకుడిని అవ్వాలనుకున్నా ఏ రోజుకైనా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటా..? అయితే నేను డైరెక్ట్ చేసే సినిమాకు హీరో మాత్రం విజయే' అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement