పైన ఉన్న ఫొటోలో సొట్టబుగ్గల సోగ్గాడిని చూశారుగా! ఇంతకీ ఈ బోసి నవ్వుల బుడతడు ఎవరో కాదండి. మంచు కుటుంబం థర్డ్ జనరేషన్ కిడ్. ఇటీవల విష్ణు సతీమణి విరానిక ఓ బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ చిన్నారికి ‘అవ్రామ్ భక్త మంచు’ అని నామకరణం చేశారు. ‘‘మీరు చూస్తున్నది మా లిటిల్ లయన్.
మీ ఆశీర్వాదం కావాలి’’ అని గురువారం అవ్రామ్ భక్త మంచు ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు విష్ణు. ఆల్రెడీ విష్ణుకు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మంచు అభిమానులైతే... ‘‘ఏం సక్కగున్నావ్‌రో.. మా సొట్ట సెంపలోడ..’ అంటూ అవ్రామ్ బాబాయ్ మంచు మనోజ్ ‘ఝుమ్మంది నాదం’ సినిమాలోని పాటను కోడ్ చేసి పాడుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment