
ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, నాని
‘‘నేను నేనుగా ఉండగలిగే షో ఇది. ఇంకొకరిలా నటించాల్సిన అవసరం లేదు. నన్ను నన్నుగా ఆవిష్కరించిన షో’’... ‘బిగ్ బాస్’ అంగీకరించినప్పుడు ఎన్టీఆర్ అన్న మాటలివి. ఎక్కువ యాక్షన్ మూవీస్‌లో కనిపించే ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ షోని రసవత్తరంగా నిర్వహించగలుగుతారా? అసలు సరదాగా మాట్లాడగలుగుతారా? అనే డౌట్ చాలామందికి ఉండేది. కానీ ఆ అనుమానాలన్నీ ‘బిగ్ బాస్’ షో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ పటాపంచలు చేసింది. 70 ఎపిసోడ్స్‌గా సాగిన ఫస్ట్ సీజన్‌లో మాట, ఆట, పాటలతో ఎన్టీఆర్ ఇంటిల్లిపాదీ బుల్లితెరకు అతుక్కుపోయేలా చేశారు.
ఫస్ట్ సీజన్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు కాబట్టి సెకండ్ సీజన్‌కి కూడా ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని చాలామంది భావించారు. అయితే ఓ చేదు వార్త. రెండో సీజన్ ఎన్టీఆర్ చేయడంలేదు. ‘టైమ్ కుదరకపోవచ్చు’ అని నిర్వాహకులకు ఎన్టీఆర్ తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్. దాంతో నెక్ట్స్ బిగ్ బాస్‌ను వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్, నాని పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. మరి.. నెక్ట్స్ బిగ్ బాస్ ఎవరు? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment