‘జంజీర్’రీమేక్‌పై విమర్శల తుఫాన్!
‘జంజీర్’ చిత్రంపై బాలీవుడ్‌లో విమర్శల తుఫాన్ జోరందుకుంది. షోలే చిత్రాన్ని ‘ఆగ్’ రీమేక్‌గా మలిచిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అమితాబ్ చిత్రాల రీమేక్‌లో అత్యంత నాసిరకమైన చిత్రం ‘జంజీర్’ అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన క్లాసిక్స్ చిత్రాలు ‘డాన్’, ‘అగ్నిపథ్’ రీమేక్‌లకు బాలీవుడ్‌లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
తాజాగా రాంచర ణ్ తేజ బాలీవుడ్‌కు పరిచయం అవుతూ అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ‘జంజీర్’ రీమేక్‌కు బాలీవుడ్‌లో దారుణమైన ఒపెనింగ్స్ రావడం మింగుడుపడని విషయంగా మారింది. భారీ అంచనాలతో 2086 ధియేటర్లలో విడుదలైన ’జంజీర్’ చిత్రం తొలి రెండు రోజుల్లో 3.58 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. జంజీర్ రీమేక్ బాలీవుడ్ ప్రేక్షకులకు భారీ నిరాశనే మిగిల్చింది.
‘జంజీర్ ఓ క్లాసిక్ చిత్రం. జంజీర్ రీమేక్ చాలా పేలవంగా ఉంది. జంజీర్‌ను అపవిత్రం చేశారు’ అని బాలీవుడ్ సినీ విమర్శకులు అంటున్నారు.