
నటుడు ఆదిత్య పంచోలి భార్య జరీనా వాహబ్.. బాలీవుడ్ ‘క్వీన్’, ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై ఫైర్ అయ్యారు. తన భర్త ఎటువంటి వాడో తనకు పూర్తిగా తెలుసునని, అతడిపై అసత్య ఆరోపణలు చేయొద్దని కంగనాను విమర్శించారు. కెరీర్ తొలినాళ్లలో ఆదిత్య పంచోలీ తనను లైంగికంగా వేధించి, దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కంగనా రనౌత్.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై స్పందించిన నటి జరీనా మాట్లాడుతూ.. ‘ నా భర్త గురించి నాకంటే ఎవరూ బాగా అర్థంచేసుకోలేరు. తను నా దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు. గతంలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అన్ని విషయాల గురించి తెలుసు. తనెప్పటికీ తప్పు చేయడు. కొంతమంది ఆడవాళ్లు తమ రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత..భాగస్వామిపై నిందలు వేస్తారు. అకస్మాత్తుగా... అత్యాచారానికి గురయ్యామంటూ గగ్గోలు పెడతారు. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా తమతోనే ఉండాలనే భావనతోనే ఇలా చేస్తారు. ఇది సరైంది కాదు’ అని కంగనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా కంగనా ఆరోపణలపై స్పందించిన ఆదిత్య పంచోలి ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి భార్య కూడా ఆదిత్యకు అండగా నిలుస్తూ కంగనాను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక నటి పూజా బేడి పనిమనిషిపై ఆదిత్య పంచోలి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment