ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రైల్వే కార్మికులు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తమ 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్‌మంతర్‌లో రైల్వే, రక్షణ, తపాలా ఉద్యోగులతో శుక్రవారం ధర్నా నిర్వహించారు.
జూలై 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే సమ్మెపై పునరాలోచిస్తామన్నారు. రైల్వేలో కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని, పాత పెన్షన్ విధానం అమలు, రైల్వే ప్రైవేటీకరణకు అనుమతించరాదని, బోనస్ పెంచాలని, కార్మికుడి పదవీకాలంలో 5 పదోన్నతులు కల్పించాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే తదితర డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్టు వివరించారు.
11 నుంచి కేంద్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె
Published Sat, Jun 25 2016 4:14 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement
Advertisement