ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 873కు చేరింది. అదే విధంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. (మహమ్మారి తొలి ఫొటోలు విడుదల)
ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సామాన్య పౌరులు సహా అధికారులపై కొరడా ఝళిపిస్తున్నాయి. అదే విధంగా కష్టకాలంలో అత్యవసరంగా మారిన మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 24 వేలకు పైగా మంది కరోనా బారిన పడి మరణించగా... 5 లక్షలకు మందికి పైగా ఈ మహమ్మారి సోకిన విషయం తెలిసిందే.(అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు?)
Comments
Please login to add a commentAdd a comment