
కొండచరియలు విరిగిపడటంతో మట్టి, బండరాళ్లకింద కూరుకుపోయిన ఓ ఇల్లు
సిలిగురి: పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 18 మంది దుర్మరణం చెందారు. జిల్లాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కలింపాంగ్, కుర్సేంగ్ సబ్ డివిజన్ లో మంగళవారం రాత్రి దాదాపు 25చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.
వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గల్లంతయ్యారు. డార్జిలింగ్, సిక్కం లను కలిపే 10 నంబర్ జాతీయ రహదారిపైనా కొండచరియలు పడటంతో గత రాత్రి నుంచి రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. బుధవారం ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకున్న అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.