న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సొంత దేశంలోని వివిధ ప్రాంతాలను చూడనంత వరకు మన వైవిధ్యం గురించి తెలుసుకోలేమని ప్రధాని మోదీ గత మన్‌కీ బాత్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర పర్యాటక శాఖ ‘పర్యటన్ పర్వ్’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయి. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, పర్యాటక రంగం ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ఈసారి అక్టోబర్ 5 నుంచి 20 జరిగే ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తామని ఆ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment