కోరిక తీర్చలేదని స్నేహితుడిని పొడిచాడు..! | 27-year-old man tries to kill ​his friend | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని స్నేహితుడిని పొడిచాడు..!

Published Fri, Sep 8 2017 9:41 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

కోరిక తీర్చలేదని స్నేహితుడిని పొడిచాడు..! - Sakshi

కోరిక తీర్చలేదని స్నేహితుడిని పొడిచాడు..!

సాక్షి, మధ్యప్రదేశ్: సాధారణంగా పురుషులు స్త్రీలను వేధించే సంఘటనలు చూస్తాం. కొంచెం అరుదుగా మహిళలు పురుషులను వేధించడం చూస్తాం. కానీ మధ్య ప్రదేశ్‌లో వింత ఘటన జరిగింది. తన కోరిక తీర్చేందుకు నిరాకరించిన స్నేహితుడిపై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఆపై పోలీసులకు భయపడి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబువాలో చోటుచేసుకుంది.

ఓల్డ్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన బైగ్లా అనే వ్యక్తి స్నేహితుడైన రాకేష్‌(27) గురువారం రాత్రి తన ఇంటికి ఆహ్వానించాడు. తనతో లైంగిక చర్యలో పాల్గొనాలని కోరగా అతడు నిరాకరించాడు. దీంతో రాకేష్‌ను కత్తితో పొడిచి, తను కూడా పొడుచుకున్నాడు. వీరి కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఇద్దరినీ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ మహేష్‌ చంద్ర జైన్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement