రాజధాని ఇంఫాల్లో బుధవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 20మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
మణిపూర్: రాజధాని ఇంఫాల్లో బుధవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 20మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న రిస్కూం టీం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
బాంబు పేలుడు ఘటనలో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.