
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది.
ఇంఫాల్ : మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని తంగల్ బజార్ వద్ద మంగళవారం ఉదయం బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. బాంబు పేలడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురు పోలీసులున్నారు. బాంబు పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకని విస్తృత తనిఖీలు చేపట్టారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, పేలుడు ధాటితో సమీపంలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాంబు పేలుడుకు కారణాలేమిటనేది ఇంకా వెల్లడికాలేదు.