నగర నడిబొడ్డున ఐదుగురు మహిళలపై గుర్తుతెలియని వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు.
బెంగళూరు: నగర నడిబొడ్డున ఐదుగురు మహిళలపై గుర్తుతెలియని వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. భయపడిన మహిళలు కేకలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బెంగళూరు ఎం.జి.రోడ్డులో కారులో వెళ్తున్న ఐదుగురు మహిళలు ఐస్‌క్రీమ్ పార్లర్ వద్ద వాహనాన్ని ఆపా రు.
డ్రైవర్ ఐస్‌క్రీమ్‌లు తేవడానికి వెళ్లగా హఠాత్తుగా గుర్తుతెలియని వ్యక్తులు కారును చుట్టుముట్టి మహిళలను తీవ్రంగా భయపెట్టారు. కారు డోర్ తీయడానికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా మహిళలు కారు హారన్ మోగించి, కేకలు పెట్టడంతో వారు పారిపోయారు. ఈ ఉదంతాన్ని వీడియో తీసిన బాధితులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.