రాయ్‌పూర్ : చత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో ఆరుగురు మృతి చెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరీ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్లాంట్‌లోని కోక్ ఒవెన్ సెక్షన్ సమీపంలోని పైప్‌లైన్‌లో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
2014లో కూడా ఈ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఆరుగురు మృతి చెందారు. వాటర్ పంప్ హౌస్ బ్రేక్‌డౌన్ కావడంతో కార్బన్ మోనోక్సైడ్ విషవాయివు లీకయింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) పర్యవేక్షణలో నడిచే భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఈ ఏడాదే ఆధునీకరించారు. నవీకరించిన ఈ ప్లాంట్‌ను జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశంలోనే ఉత్తమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా భిలాయ్ స్టీల్ ప్లాంట్ గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment