ఢిల్లీ : దేశ సమగ్ర వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకోలేదని తెలిపారు. ప్రతి వర్గానికి మేలు జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లింపు నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి 2018 డిసెంబర్ నుంచే అమలవుతుందని చెప్పారు.
రూ. 6 వేల ఆర్థిక సాయం చిన్న రైతులకు గొప్ప ఊరటనిస్తుందని పీయూష్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో 12.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారన్నారు. ముద్ర రుణాల ద్వారా అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకున్నామన్నారు. పెన్షన్ పథకం ద్వారా కోట్లాది మందికి ప్రయోజం చేకూరనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment