వికటించిన ఆపరేషన్లు, 8మంది మహిళలు మృతి | 8 women dead, 20 critical after sterilisation camp in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఆపరేషన్లు వికటించి 8మంది మహిళలు మృతి

Published Tue, Nov 11 2014 9:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

8 women dead, 20 critical after sterilisation camp in Chhattisgarh

ఛత్తీస్గఢ్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 8మంది మహిళలు మృతి చెందారు.  ఈ సంఘటన  ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో చోటుచేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న  మరో 50 మంది మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 20మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి రూ.50 వేలు సాయం ప్రకటించింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం  కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 83మంది మహిళలు (లాప్రోస్కోపీ)  ఆపరేషన్లు చేయించుకున్నారు. అయితే ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు సోమవారం మృతి చెందారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మంగళవారం మరణించినట్లు సమాచారం.

మిగతావారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల  ఈ దుర్ఘటన జరిగినట్లు వస్తున్న వార్తలను జిల్లా చీఫ్ మెడికల్ అధికారి బాంగీ తోసిపుచ్చారు. సీనియర్ వైద్యుడు డాక్టర్ ఆర్.కె.గుప్తా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు జరిగినట్లు చెప్పారు. కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అమీర్ అగర్వాల్ సొంతజిల్లాలో ఈ సంఘటనపై చోటుచేసుకోవటంతో విపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement