డబ్బులిస్తామని మభ్యపెట్టి ఆపరేషన్లు చేశారు! | 'Women were lured to sterilisation camp with promise of money' | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తామని మభ్యపెట్టి ఆపరేషన్లు చేశారు!

Published Sun, Nov 16 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

'Women were lured to sterilisation camp with promise of money'

బిలాస్ పూర్: అధిక మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని ప్రలోభపెట్టి చత్తీస్ గఢ్ లో మహిళలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఒప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొన్ని రోజులక్రితం చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని 13 మంది మహిళలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో పాటు మందులను ఉచితంగా ఇప్పిస్తామని ఆరోగ్య అధికారులు తమను బలవంతంగా ఒప్పించారని బైగా అనే మహిళ భర్త మీడియాకు వెల్లడించాడు.

 

అయితే ఆపరేషన్ తరువాత తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఆపరేషన్ తరువాత ప్రయాణ ఖర్చుల కింది రూ.40 మాత్రమే ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యాడు. రాయ పూర్ కు 260 కి.మీ దూరంలో ఉన్న గౌరెలా గిరిజన ప్రాంతాల్లో 18 మందికి పైగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement