ఉద్యోగం పేరుతో యువతిపై...
హర్యానా: పశ్చిమ బెంగాల్ నుండి ఉద్యోగం కోసం వచ్చిన ఒంటరి యువతిపై (22) ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్లోని ఓ గెస్ట్హౌస్లో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుల్లోని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. కార్యాలయానికి తీసుకు వెళుతున్నానని చెప్పి, ఆమెను గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం ఆ వ్యక్తితో సహా ఏడుగురు ... ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ జరిగిన ఘోరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. భర్తతో విభేదాల కారణంగా వేరుగా ఉంటోంది. తన కొడుకును పోషించుకోవడానికి, ఉపాధి కోసం రెండు సంవత్సరాల క్రితం గుర్గావ్‌కు వెళ్లినట్టు సమాచారం.