ఆధార్ ఉంటేనే పాస్‌పోర్టు!
న్యూఢిల్లీ: పాస్‌పోర్టుల మంజూరుకు ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆధార్ కార్డు లేని వారు ఆధార్ నమోదు సంఖ్యనైనా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల నేర చరిత్రను నిర్ధారించుకోవడానికి జాతీయ నేరాలనమోదు సంస్థ సమాచారం ఆధారంగా ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
హోం, విదేశాంగ శాఖల భేటీలో వీటి గురించి చర్చించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. వీటి అమలుకు విదేశాంగ శాఖ.. విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ(యూఐడీఐఏ)తో కలసి కసరత్తు చేస్తోందని, ఇది ఈ నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశముందని అన్నాయి.