ఆమిర్‌ఖాన్‌పై కేసు నమోదు | aamir khan faces court heat for nude poster | Sakshi
Sakshi News home page

ఆమిర్‌ఖాన్‌పై కేసు నమోదు

Published Fri, Aug 22 2014 3:30 AM | Last Updated on Wed, Apr 3 2019 7:07 PM

ఆమిర్‌ఖాన్‌పై కేసు నమోదు - Sakshi

ఆమిర్‌ఖాన్‌పై కేసు నమోదు

చిక్కుల్లో ‘పీకే’ చిత్ర నిర్మాతలు

జబల్‌పూర్(మధ్యప్రదేశ్): వివాదాస్పద పోస్టర్‌లో నగ్నంగా కనిపించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్‌తోపాటు చిత్ర నిర్మాతలు చిక్కుల్లో పడ్డారు. ‘పీకే’ పేరుతో రూపొందుతున్న చిత్రం విషయంలో ఆమీర్‌ఖాన్, చిత్ర నిర్మాతలు రాజు హిరానీ, విధు వినోద్ చోప్రాలపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కోర్టు తాజాగా పోలీసులను ఆదేశించింది. న్యాయవాది అమిత్ సాహు ఫిర్యాదు మేరకు కేసు దాఖలైంది. ఫిలిం, టెలివిజన్ నిర్మాతల గిల్డ్ అధ్యక్షుడు ముఖేష్‌భట్‌తోపాటు వివాదాస్పద పోస్టర్‌ను ప్రచురించిన మూడు స్థానిక దినపత్రికల ఎడిటర్, ప్రచురణకర్తలపై కూడా కేసు నమోదుకు న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement