బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌తో డిన్నర్ కార్యక్రమంలో ఆ పార్టీకి భారీగానే నిధులు సమకూరాయి. నిధుల సమీకరణ కోసం శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్‌లో 200 మంది పాల్గొనగా ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.20 వేలు చందాగా వసూలు చేశారు.
పార్టీ శ్రేయోభిలాషుల పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఆప్ అభ్యర్థి, ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ నేతృత్వం వహిం చారు. ఈ డిన్నర్ ద్వారా పార్టీకి రూ. 50 లక్షలు సమకూరాయని ఒక శ్రేయోభిలాషి సీఎన్ రాధాకృష్ణన్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. డిన్నర్‌కు హాజరుకాలేకపోయిన మరికొంత మంది త్వరలోనే తమ విరాళాలను పార్టీకి అందజేస్తారని ఆయన చెప్పారు.
ఆప్ ‘డిన్నర్’ రాబడి 50 లక్షలు
Published Mon, Mar 17 2014 2:32 AM | Last Updated on Mon, Aug 20 2018 4:05 PM
Advertisement
Advertisement