
నరేంద్ర మోడీ సమర్థుడు!
అమెరికా కాంగ్రెస్ నివేదికలో వ్యాఖ్య
వాషింగ్టన్: గత మూడు దశాబ్దాల్లో లేనంతగా పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని.. భారత్-అమెరికాల మధ్య ఆయన సరికొత్త సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ పేర్కొంది. ఆయన హయాంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని.. వాణిజ్యం, రక్షణ సహకారం బలోపేతమవుతుందని వ్యాఖ్యానించింది. త్వరలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో... ఆ దేశ ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఒక నివేదికను రూపొందించి.. దానిని సభ్యులకు అందజేసింది.
మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం: పాక్
ఇస్లామాబాద్: భారత్‌పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందన్న మోడీ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. భారత్‌తో తామ సత్సంబంధాలను కోరుకుంటున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొంది.