'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది! | Air pollution levels in Delhi drop by 300% on day 2, odd-even formula a major success, says Sisodia | Sakshi
Sakshi News home page

'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!

Published Sun, Jan 3 2016 3:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!

'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్‌ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే రోజుతో పోల్చుకుంటే హస్తినలో వాయుకాలుష్యం దాదాపు 300శాతం తగ్గిందని తాజాగా తేలింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదించిన ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఈ విధానం ఢిల్లీలో అమల్లోకి వచ్చింది.

అయితే, సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడం.. ఉద్యోగులు పెద్దసంఖ్యలో వాహనాలతో రోడ్ల మీదకు రానుండటంతో సోమవారం నుంచి 'సరి-బేసి' విధానం మీద అసలు పరీక్ష మొదలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమల్లో భాగంగా సైకిల్‌ మీద తన కార్యాలయానికి వెళ్లి అందరి దృష్టి ఆకర్షించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'సరి-బేసి' విధానం అమలు విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ విధానం అమలు వల్ల శనివారం ఒక్కరోజు 300శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపారు. 15 రోజులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తే.. నగరంలో కాలుష్యంపై ప్రజలకు చైతన్యం పెరిగి.. ప్రత్యామ్నాయా రవాణా సదుపాయాన్ని కూడా వారు వినియోగించుకునే అవకాశముందని ఆయన చెప్పారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement